Breaking News

పెళ్లి కాకుండానే చెల్లికి గర్భం.... ప్రియుడిని కొట్టి బావిలో పడేసిన అన్నలు


తమ చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కక్షతో ముగ్గురు అన్నలు ఓ యువకుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఘటన జిల్లా కొండపాట మండలం బందారంలో జరిగింది. యువకుడిని తీవ్రంగా కొట్టిన ముగ్గురు సోదరులు అతడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయాడనుకుని బావిలో పడేశారు. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. మెదక్‌ మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన బింగి శ్రీకాంత్‌ అదే గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ హైదరాబాద్‌లోని నాగారంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. Also Read: యువతి కూడా హైదరాబాద్‌లోనే అన్నలతో కలిసి ఉంటూ ఉద్యోగం చేస్తోంది. తరుచూ ప్రియుడి ఇంటికి వెళ్లొచ్చేది. ఈ క్రమంలోనే ప్రేమికులిద్దరూ తరుచూ శారీరకంగా కలిసేవారు. ఫలితంగా యువతి గర్భం దాల్చింది. ఈ విషయం మంగళవారం యువతి అన్నలకు తెలిసింది. దీంతో వారు పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మంటూ శ్రీకాంత్‌కు మాయమాటలు చెప్పి చేర్యాలకు రప్పించారు. కారులో ఎక్కించుకుని స్పృహ కోల్పోయేలా కొట్టారు. ప్రాణం పోయిందనుకుని బందారం శివారులో మెడకు తాడు బిగించి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి ఓ బావిలోకి తోసేసి వెళ్లిపోయారు. Also Read: బావిలో కొంతమేర నీరు, పూడిక తీసిన గడ్డ ఉండటంతో అతడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. మంగళవారం రాత్రి స్పృహలోకి వచ్చి రక్షించాలంటూ గట్టిగా అరిచాడు. రాత్రివేళ కావడంతో అతడి ఆర్తనాదాలు ఎవరికీ చేరలేదు. 20 గంటల అనంతరం బుధవారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులకు అతడి అరుపులు వినిపించడంతో వారు వెంటనే గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారమిచ్చారు. మంచాన్ని బావిలోకి దించి తాళ్లతో శ్రీకాంత్‌ను బయటకు లాగి చికిత్స కోసం సిద్దిపేటకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముగ్గురు సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. Also Read:


By May 21, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-brothers-murder-attempt-on-sisters-boyfriend-in-medak-district/articleshow/75859371.cms

No comments