కండోమ్స్ స్కర్ట్‌తో ఉపాసన.. ఇవి ధరించడానికి ధైర్యం ఉందా అంటూ వైరల్ పోస్ట్
హెల్త్, ఫిట్ నెస్ విషయంలో మెగా కోడలు నెటిజన్స్‌కు అనేక సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇటీవల ఇండియన్ టాయిలెట్ పొజిషన్ కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మెగా కోడలు. వెస్టరన్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇండియన్ టాయిలెట్ పొజిషన్‌లో కూర్చోవడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదని.. నిజానికి ఇలా కోర్చోవడం వల్ల ఆరోగ్యకరైన ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలుపుతూ టాయిలెట్ పొజిషన్ కూర్చుని మరీ ఫొటోని విడుదల చేశారు ఉపాసన. అపోలో సంస్థల భాగస్వామిగా ఉన్న ఉపాసన.. మెగా కోడలుగా మారిన తరువాత మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తనకి తెలిసిన టిప్స్ అందిస్తూనే ఉన్నారు. తాజాగా డిజైనర్ దుస్తులకు సంబంధించి ఉపసన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనికి రాని వాటిని కూడా ఎలా ఉపయోగించుకుకోవచ్చో తెలియజేస్తూ ఉపాసన తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఈ ఆసక్తికరమైన పోస్ట్‌ను పెట్టింది. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన డిఫెక్టెడ్ కండోమ్స్, టెక్స్ టైల్ స్క్రాప్‌తో రూపొందించిన డిజైనర్ వేర్‌ను ధరించి ‘సస్టైనబుల్ ఫ్యాషన్‌దే ఫ్యూచర్’ అంటుంది ఉపాసన. ఈ సందర్భంగా తన క్రియేటివ్ డిజైనర్ వేర్‌ను ధరించిన ఉపాసన.. లోకల్ డిజైనర్ల నుండి రిజెక్ట్ చేయబడిన టెక్స్ టైల్ స్క్రాప్‌తో ఈ డిజైన్ తయారు చేయబడిందని.. తాను ధరించిన స్కట్ కూడా డిఫెక్టెడ్ కండోమ్స్ (పనికి రాని కండోమ్స్) తయారు చేసిందని తెలియజేస్తూ.. ఈ స్క్రాప్ ధరించడానికి మీలో ఎంతమందికి ధైర్యం ఉందని చాలెంజ్ చేస్తున్నారు ఉపాసన. ప్రస్తుతం ఉపాసన కండోమ్ స్కట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By May 21, 2020 at 09:46AM
No comments