Breaking News

స్టార్ కమెడియన్ మిస్ బిహేవ్ చేశాడు.. క్యారవాన్‌కి తీసుకెళ్లి.. ప్రగతి సంచలన ఆరోపణ


సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవమే అని ఇప్పటికే ఎందరో సినీ తారలు బాహాటంగా ఒప్పుకున్నారు. తమకు జరిగిన చేదు సంఘటనలను నిర్మొహమాటంగా చెబుతూనే క్యాస్టింగ్ కౌచ్ భూతానికి భయపడేదే లేదని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి సంచలన ఆరోపణలు చేసింది తెలుగు నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ . లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఇలా మట్లాడటం ఇండస్ట్రీలో హాట్ ఇష్యూగా మారింది. హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా, వదినగా, అక్కగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ వందలాది తెలుగు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రగతి. స్క్రీన్ మీద గ్లామర్‌గా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా ఆమెకు స్పెషల్ పాపులారిటీ దక్కింది. అయితే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తాను కూడా చేదు అనభవాలు ఎదుర్కొన్నానని, సీనియర్ మోస్ట్ కమెడియన్ తనతో తప్పుగా ప్రవర్తించడాని చెప్పి షాకిచ్చింది ప్రగతి. షూటింగ్ జరుగుతుండగానే ఓ వ్యక్తి తనతో మిస్ బిహేవ్ చేసాడని, పైగా అతను టాలీవుడ్‌లో పేరు మోసిన కమెడియన్ అని చెప్పింది ప్రగతి. కావాలనే ఇబ్బంది పెడుతూ ఎక్స్‌ట్రాలు చేసేవాడని అంతటితో ఆగక పదేపదే తనను తాకాలని ప్రయత్నించే వాడని తెలిపింది. ఆ చేష్టలు బాగా ఇబ్బంది కలిగించడంతో ఓ రోజు క్యారవాన్‌కి తీసుకెళ్లి.. నా పట్ల మీ ప్రవర్తన ఏ మాత్రం బాలేదని, ఇది మంచిది కాదని వార్నింగ్ ఇవ్వడంతో అతను సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్తిపోయాడని ప్రగతి చెప్పింది. ఆ తరువాత ఆ స్టార్ కమెడియన్ తన గురించి అందరితో తప్పుగా చెబుతూ ఆమెకు బాగా పొగరు అని తెలిపేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ కమెడియన్ పేరు చెప్పపోవడంతో ఈ ఇష్యూ పలు చర్చలకు దారితీసింది. ఇకపోతే ఇటీవలే లుంగీ కట్టి తీన్మార్ స్టెప్పులతో డాన్స్ చేస్తూ ప్రగతి చేసిన రచ్చ ఇంటర్పెట్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. దీంతో ప్రగతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతునదేని బయటపడింది. Also Read:


By May 05, 2020 at 08:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/charecter-artist-says-about-star-comedian-behaviour-in-film-industry/articleshow/75545803.cms

No comments