హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో ఏం రాశారంటే..
హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని ఉప్పల్ స్వరూప్ నగర్‌లో నివాసముండే బాల సుదర్శన్(38) కింగ్ కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి సుదర్శన్ భార్య, ఇద్దరు పిల్లలు గదిలో నిద్రపోగా.. ఆయన మాత్రం బాల్కనీలో పడుకున్నాడు. సోమవారం ఉదయం భార్య నిద్రలేచి చూసేసరికి సుదర్శన్ బాల్కనీలో కొక్కేనికి ఉరేసుకుని కనిపించాడు. Also Read: దీంతో షాకైన ఆమె వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని సుదర్శన్ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సుదర్శన్ బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తరుచూ ఆవేదన చెందేవాడని, ఆ మనస్తాపంతోనే చేసుకుని ఉండొచ్చని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. Also Read:
By May 05, 2020 at 07:15AM
No comments