చాలా భయమేస్తోంది.. అదే అనుమానం వెంటాడుతోంది.. ఈ హీరోయిన్ లాగే ఇంకెంతమంది?
కోరలు చాస్తోంది. చాప కిందనీరులా విస్తరిస్తూ దేశ విదేశాల్లో విలయతాండవం చేస్తోంది. మన దేశంలో కరోనా కోరలు విరిచే క్రమంలో గత రెండు నెలలుగా లాక్‌డౌన్ వింధించిన సంగతి తెలిసిందే. బస్సు, రైలు, విమానయాన సర్వీసులు రద్దు చేసి ఎక్కడి వారిని అక్కడే ఉంచేశారు. మరోవైపు అన్ని పరిశ్రమలు, సినిమా షూటింగ్స్, థియేటర్స్, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్క్స్ అన్నీ క్లోజ్ చేసి కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో లాక్‌డౌన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని సడలింపులు ఇస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే సినీ రంగానికి ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్స్‌కి అనుమతి ఇచ్చే దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. సో.. తిరిగి షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయంటే నటీనటులంతా సెట్స్ మీదకు వెళ్ళక తప్పదు. కొత్త ప్రాజెక్టుల సంగతెలా ఉన్నా.. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కోసం ఖచ్చితంగా షూటింగ్‌లో పాల్గొనాలి. ఈ నేపథ్యంలో తన మనసులో ఉన్న భయాన్ని ఓపెన్‌గా బయటపెట్టేసింది హీరోయిన్ . Also Read: ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొనాలంటే భయంగా ఉందని లావణ్య అంటోంది. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అనే దానిపై అనుమానంగా ఉందని, సెట్స్‌లో ఒక్కరికి పాజిటివ్ అని తేలినా యూనిట్ మొత్తానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా భయమేస్తుందని ఆమె పేర్కొంది. మరోవైపు కొందరు స్టార్ హీరోలు సైతం షూటింగ్ అనుమతులు వచ్చినా కూడా మరో రెండు నెలలు ఆడుదామని డిసైడ్ అవుతున్నట్లు టాక్. చూడాలి మరి ముందు ముందు సినిమా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో! ఇంకెంతమంది ఇలాంటి భయాలతో వణికిపోతున్నారో!.
By May 26, 2020 at 10:21AM
No comments