కన్నకూతురిపైనే కన్నేసిన కామపిశాచి.. భార్య, కొడుకు చేతిలో హత్య
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే లైంగిక దాడికి యత్నించి దారుణహత్యకు గురైన ఘటన పంజాబ్‌లోని లూథియానాలో జరిగింది. లుథియానాలోని సందర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య, కొడుకు, కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికొచ్చిన అతడు కూతురిపై చేయివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెను గదిలోకి లాక్కెళ్తుండగా భార్య, కొడుకు అడ్డుపడ్డారు. Also Read: దీంతో తనకు అడ్డొస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన అతడు కేబుల్ వైరును మెడకు బిగించి వారిని బెదిరించాడు. అతడి వేధింపులలో అప్పటికే విసిగిపోయిన కుటుంబం ఇదే అదనుగా భావించి భార్య, కొడుకు కేబుల్ వైరుతో అతడి గొంతు బిగించి చంపేశారు. ఆ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు దసేరీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతుడి భార్య, కొడుకు, కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:
By May 26, 2020 at 10:42AM
No comments