ప్రియురాలు బిడ్డను ప్రసవించిన రోజే ప్రియుడి మృతి
ప్రియురాలు బిడ్డను ప్రసవించిన నాడే ప్రియుడు ప్రాణాలు విడిచిన విషాద ఘటన తమిళనాడులో జరిగింది. తంజావూర్ జిల్లా వాట్టాత్తికోట్టై సమీప ప్రాంతానికి చెందిన యువకుడు, యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడటంతో 9నెలల క్రితం యువతి గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా అతడు నిరాకరించాడు. అంతటితో ఆగకుండా అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి అంగీకరించని ఆమె నాలుగు నెలల క్రితం పుదుకోట్టై జిల్లాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. Also Read: ఈ క్రమంలోనే అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ఆమె పుదుకోట్టైలోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అతడు పోలీసుల విచారణకు భయపడి నాలుగు రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు తంజావూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు నెలలు నిండటంతో ఆ యువతి శనివారం ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు పరిస్థితి విషమించడంతో ఆమె ప్రియుడు అదేరోజు ప్రాణాలు విడిచాడు. Also Read:
By May 26, 2020 at 09:31AM
No comments