ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారం.. తెలంగాణలో మరో ఘోరం
లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం పెన్షన్ తీసుకునేందుకు కుటుంబసభ్యులు పక్క గ్రామానికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: బాలిక అత్త ఇంటికి వస్తుండటాన్ని గమనించిన ఆ యువకుడు బయటకు పరుగు తీశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె ఏం జరిగిందోనన్న ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తస్రావంతో బాధపడుతోంది. దీంతో ఆమె వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలిక తల్లి వెంటనే యాలాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు వికారాబాద్ జిల్లా మహిళా సీఐ ప్రమీలతో విచారణ చేయించారు. యువకుడిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. Also Read:
By May 15, 2020 at 08:18AM
No comments