Breaking News

బెంగాల్ అమ్మాయిలతో వ్యభిచారం.. కాకినాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు


కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే మనుషులంతా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు మొత్తుకుంటున్నా అక్రమార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ గుట్టుగా వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు కావడంతో అందరూ నోరెళ్లబెట్టారు. తాజాగా కాకినాడలోని ఓ ఇంట్లో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు చేధించారు. రూరల్ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అవంతి నగర్‌లో కొటికలపూడి రాజా, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీష్‌ అనే ముగ్గురు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. Also Read: బెంగళూరుకు చెందిన రాజేశ్, అప్పాజీ సాయంతో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ చీకటి దందా లాక్‌డౌన్ సమయంలోనూ వీరు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు నుంచి తీసుకొచ్చి తిమ్మాపురంలో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆ ఇంటికి యువకుల తాకిడి ఎక్కవగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో వారు గురువారం ఆ ఇంట్లో రైడ్ నిర్వహించి ఇద్దరు సెక్స్‌వర్కర్లతో పాటు నిర్వాహకులు రాజు, ప్రియదర్శిని, విటులు శ్రీనుబాబు, పంపన రాముడు, సూరిబాబును అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు సతీష్‌తో పాటు అమ్మాయిల బ్రోకర్లు రాజేష్, అప్పాజీ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరు యువతులను పునరావాస కేంద్రానికి పంపినట్లు కాకినాడ పోలీసులు వెల్లడించారు. Also Read:


By May 15, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-by-kakinada-police-5-arrested-2-sex-workers-rescued/articleshow/75749873.cms

No comments