బన్నీ పిల్లలతో బాబయ్ డాన్స్... వీడియో వైరల్
లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా ఇళ్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ పిల్లలతో బాబయ్ అల్లు శిరీష్ ఎంజాయ్ చేశాడు. ఇద్దరు చిన్నారులతో కలిసి స్టెప్పులేశాడు. వీళ్లంతా డాన్స్ చేస్తున్న వీడియోను బన్నీ భార్య స్నేహా రెడ్డి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్లు శిరీష్ తన తన అన్నయ్య అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలతో కలిసి హంగామా చేశాడు. ఈ వీడియోని బన్నీ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తూ.. శిరీ బాబాయ్ తో ఫన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వాళ్ళందరూ ముద్దుగా డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు కూడా అల్లు శిరీష్ బన్నీ పిల్లలతో కలిసి దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శిరీష్ సినిమాల విషయానికి వస్తే ఆయన రీసెంట్‌గా నటించిన ఏబీసీడీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. కొత్త ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అల్లు శిరీష్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. ఇంట్లో చేస్తున్న పనుల దగ్గర నుంచి, వ్యాయామాల వరకు చేస్తన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తున్నాడు అల్లు శిరీష్.
By May 17, 2020 at 09:32AM
No comments