Breaking News

ఉమ్మేసి దొరికేశాడు.. పోలీసుల అదుపులో మోస్ట్‌వాంటెడ్ కిల్లర్


అతడో కిరాయి హంతకుడు. సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటాడు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి కోసం పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్నారు. అనూహ్యంగా బహిరంగంగా ఉమ్మేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాము వెతుకుతున్న అతడేనని తెలిసి అవాక్కయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలోని నేకార నగరలో జరిగింది. నిందితుడిని సలీం బళ్లారిగా గుర్తించారు. Also Read: ఇటీవల కలబురగిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సలీంను ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సలీం శుక్రవారం రాత్రి పీకలదాకా తాగి ఓ హోటల్‌ యజమానితో ఘర్షణపడ్డాడు. ఆ సమయంలో అతడికి భోజనం వడ్డించేందుకు నిరాకరించడంతో హోటల్‌ ముందు ఉమ్మివేసి నానా రచ్చ చేశారు. Also Read: ప్రస్తుతం కరోనా వైరస్‌ భయంతో బహిరంగంగా ఉమ్మి వేయడం నేరం కావడంతో వెంటనే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తాము గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం బళ్లారి అని తెలుసుకుని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సలీం కలబురిగి హత్యతో పాటు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కసబా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకుని తిరుగుతున్న సలీం ఉమ్మేసి దొరికిపోవడం షాకింగ్ విషయమే. Also Read:


By May 17, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/most-wanted-killer-arrested-by-karnataka-police/articleshow/75784101.cms

No comments