కీచక లెక్చరర్.. ప్రేమించడం లేదని యువతి ఫోటోలు న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి
తాను పనిచేసే కాలేజీలో చదువుతున్న యువతికి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్న కీచక లెక్చరర్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర సమీపంలోని అచ్చంపల్లికి చెందిన కోలా హరీష్‌కుమార్(26) ఉప్పల్‌లోని విజయపురి కాలనీలో ఉంటున్నాడు. 2017లో ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ అక్కడే ఎంటెక్ చదువుతున్న ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. Also Read: తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. తనకిష్టం లేదని ఆమె చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆమెకు తరుచూ వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు, ఫోటోలు పంపిస్తూ తీవ్రంగా వేధించసాగాడు. ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By May 17, 2020 at 09:58AM
No comments