అనుమానంతో భర్త ఘాతుకం.. నిర్మల్‌లో దారుణం
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను కట్టుకున్న భర్తే హత్య చేసిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముథోల్ మండలం బెంబర గ్రామానికి చెందిన షేక్ బాబుమియా, గౌస్యాబీ(40) దంపతులు. కొద్దిరోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెతో గొడవపడుతున్నాడు. మరొకరితో శారీరక సంబంధం పెట్టుకున్నావంటూ దూషిస్తున్నాడు. అనుమానంతో ఉన్మాదిగా మారిన బాబుమియా భార్యను ఎలాగైనా అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లిచ్చిన భార్య మధ్యాహ్నం సమయంలో నిద్రించడం గమనించాడు. రోకలిబండతో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. నిద్రలో ఉన్న భార్యను కిరాతకంగా చంపేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో గౌస్యాబీ అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 16, 2020 at 12:55PM
No comments