Breaking News

తెలుగు చిత్రసీమకు షాకిచ్చిన తలసాని.. థియేటర్స్ రీ ఓపెనింగ్‌పై కామెంట్స్


కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ విలవిల్లాడిపోతోంది. సుమారు రెండు నెలలుగా షూటింగ్స్, క్లోజ్ కావడంతో సినీ కార్మికుల ఉపాధికి గండి పడింది. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఇన్నాళ్లు అన్ని పనులు వాయిదా వేసుకున్న సినీ వర్గాలు ఇకనైనా తమకు ప్రభుత్వం నుంచి కొన్ని పర్మిషన్స్ వస్తాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి చేసిన కామెంట్స్ తెలుగు చిత్రసీమకు మరింత షాకిచ్చాయి. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు తలసాని. థియేటర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి సాయం చేసే పరిస్థితి లేదని అన్నారు. మరో మూడు నుంచి నాలుగు నెలల పాటు థియేటర్స్ రీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. అలాగే సినిమా షూటింగ్స్ విషయం లోనూ ఎలాంటి సాయం చేయలేమని, కరోనా మహమ్మారి నివారణలో భాగంగా మరికొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కి అనుమతి లభించదని ఆయన తెలిపారు. దీంతో చిత్రసీమకు మారో షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్స్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధం చేసిన తమ తమ సినిమాల రిలీజ్ విషయమై తలపట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు. డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) జోష్ పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ ఓటీటీ వేదికలపై సినిమాలు విడుదల చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే కొందరు నిర్మాతలు మాత్రం ముందుచూపుతో తమ సినిమాల విడుదల కోసం ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో సినీ ఇండస్ట్రీలో మరిన్ని మార్పులు చూడటం ఖయామే అని తెలుస్తోంది. Also Read:


By May 16, 2020 at 12:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/minister-talasani-says-no-theatres-for-next-3-to-4-months/articleshow/75772267.cms

No comments