Breaking News

యుద్ధ విమానాలను కూల్చే హై ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన అమెరికా


గాలిలోనే యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసే అత్యంత శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని అమెరికా అభివృద్ధి చేసింది. దీన్ని గతవారం విజయవంతంగా యుద్ధనౌక నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ నౌకాదళం ప్రకటించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత అమెరికా ఇలాంటి భారీ ప్రయోగం నిర్వహించడం ఇదే తొలిసారి. భవిష్యత్‌ యుద్ధ రీతులకు ఈ ప్రయోగం దర్పణం పడుతోంది. లేజర్‌ వెపన్స్‌ సిస్టమ్‌ డిమోనిస్ట్రేటర్‌ (ఎల్‌డబ్ల్యూఎస్‌డీ)లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు తెలిపింది. Read Also: యూఎస్‌ఎస్‌ పోర్ట్‌లాండ్‌ యుద్ధనౌక నుంచి ఈ నెల 16న ఈ శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని పరీక్షించినట్లు అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది. గాల్లో ఎగురుతున్న మానవ రహిత విమానాన్ని ఈ లేజర్లు నేలకూల్చాయి. ‘సాలిడ్‌ స్టేట్‌ లేజర్‌’ను ఉపయోగించి ఒక లోహ విహంగాన్ని ధ్వంసం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని పరిశోధకులు తెలిపారు. పసిఫిక్ మహా సముద్రంలోనే ఈ పరీక్షను నిర్వహించినట్టు అమెరికా నౌకాదళం తెలిపినా.. ఏ ప్రాంతంలో చేపట్టారో స్పష్టం చేయల Read Also: ఈ సామర్థ్యం గురించి కూడా తెలియజేయలేదు.. కానీ, 2018లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీక్ స్టడీస్ నివేదిక ప్రకారం.. 150 కిలోవాట్స్ లేజర్‌గా భావిస్తున్నారు. యుఏవీలు, చిన్న యుద్ధ విమానాలపై సముద్రాలో అధునాతన పరీక్షలు నిర్వహించడం ద్వారా సాలిడ్ స్టేట్ లేజర్ వెపన్స్ సిస్టమ్ డెమోనిస్ట్రేటర్ సామర్థ్యాలపై విలువైన సమాచారం లభిస్తుందని పోర్ట్‌ల్యాండ్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ క్యారీ సాండర్స్ వ్యాఖ్యానించారు. Read Also: డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ)‌గా పిలిచే లేజర్.. డ్రోన్స్ లేదా చిన్న యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కొంటుందని నేవీ పేర్కొంది. నేవీ అభివృద్ధి చేసిన ఎల్‌డబ్ల్యూఎస్డీ లాంటి డీఈడబ్ల్యూలు తక్షణ యుద్ధనౌక ప్రయోజనాలను అందజేస్తాయని, కమాండర్‌కు నిర్ణీత స్థలం, ప్రతిస్పందన ఎంపికలను మరింత పెంచిందని పేర్కొంది. ఇక, 2017లో 30 కిలోవాట్ల సామర్థ్యం గల లేజర్ ఆయుధాన్ని పర్షియా గల్ఫ్ యూఎస్ఎస్ పోన్సే యుద్ధ నౌక నుంచి అమెరికా పరీక్షించింది. ఈ ఆయుధం ఎలా పనిచేస్తుందో నాటి లెఫ్టినెంట్ కేల్ హ్యూగ్స్ వివరించారు. నిర్ధేశిత లక్ష్యంపై భారీ మొత్తంలో ఫోటాన్లను విసురుతుందని అని హ్యూస్ చెప్పారు. ‘తాము గాలి వేగం గురించి, పరిధి గురించి మరేదైనా విషయం గురించి ఆందోళన చెందమని. లక్ష్యాలను కాంతి వేగంతో ధ్వంసం చేయలగలం’ అని తెలియజేశారు.


By May 24, 2020 at 11:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-successfully-tested-a-laser-weapon-that-can-destroy-aircraft-mid-flight/articleshow/75936882.cms

No comments