Breaking News

తెలంగాణ బాలికపై ప్రియుడు, అతడి ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్.. ఏపీలో దారుణం


ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మ పేరుతో ఓ బాలికను వంచించిన ఓ కామాంధుడు ఆ దృశ్యాలను వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శనివారం వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన రామయ్య అనే యువకుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో బేల్దార్‌ పనులకు వెళ్లాడు. ఆ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి తన ఇంటికి తీసుకొచ్చి అనేకసార్లు అత్యాచారం చేశాడు. సుమారు 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. Also Read: ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని బాలికను తీవ్రంగా వేధించసాగాడు. తన స్నేహితులకు కూడా లైంగిక సుఖం అందించాలంటూ ఆమెను బెదిరించాడు. ఆ బాలిక ఒప్పుకోకపోవడంతోనే రామయ్య స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. రామయ్య ఇంట్లోనే బందీగా ఉన్న బాలికను కోరిక తీర్చాలంటూ ఆ కామాంధులు నిత్యం వేధించసాగారు. అయితే వారి బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ అధికారులు ఆమె వివరాలు అడగడంతో ఈ కీచక ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read:


By May 24, 2020 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-minor-girl-gang-raped-in-prakasam-district/articleshow/75936179.cms

No comments