పెళ్లి పేరుతో లైంగిక వాంఛలు తీర్చుకుని.. బిడ్డకు పుట్టాక పరారైన ప్రియుడు
ప్రేమించానని యువతిని నమ్మించి పెళ్లి పేరుతో లొంగదీసుకుని తల్లిని చేసిన యువకుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంత్(23) రెండేళ్ల క్రితం ఖైతరాబాద్ సమీపంలోని ఎమ్‌ఎస్ మక్తా ప్రాంతంలో నివాసముండేవాడు. అదే అపార్ట్‌మెంట్లో ఓ యువతిని ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తిప్పుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆమె గర్భం దాల్చింది. యువతి ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా దాటవేస్తూ వచ్చాడు. మరోవైపు ఆమెకు నెలలు నిండటంతో కొద్దిరోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్.. నీకు, నీ బిడ్డతో నాకు సంబంధం లేదని చెప్పి పరారయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By May 24, 2020 at 12:06PM
No comments