Breaking News

ఉద్యోగం కోసం వెళ్తే వ్యభిచారం చేయాలంటూ.. ‘అనంత’ యువతికి చేదు అనుభవం


తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే చనిపోవడంతో ఆమె బంధువుల వద్దే పెరిగింది. పేద కుటుంబం కావడంతో ఆమెకు పెళ్లి చేసి పంపేందుకు బంధువులు సతమతమవుతున్నారు. దీంతో ఏదైనా ఉద్యోగం చేసి వారికి అండగా నిలవాలని ఆ యువతి నిర్ణయించుకుంది. దీంతో తనకు ఎక్కడైనా పని ఇప్పించాలని పరిచయస్తురాలిని కోరగా ఆమె వ్యభిచార రొంపిలోకి దించేందుకు యత్నించింది. అయితే ఆ యువతి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని సన్నిహితురాలి వద్ద ఆశ్రయం పొందింది. ఈ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. Also Read: అనంతపురం పట్టణానికి చెందిన ఓ యువతి తనకు ఏదైనా పని ఇప్పించాలని పద్మావతి అనే మహిళను కోరింది. యువతి ఆర్థిక అవసరాల గురించి తెలుసుకున్న పద్మావతి ప్రొద్దుటూరులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కొద్దిరోజుల క్రితం బస్సు ఎక్కించింది. ప్రొద్దుటూరు చేరుకున్న ఓ మహిళ వచ్చి ఆమె తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచింది. మూడ్రోజులైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆ యువతి నిలదీసింది. ఇక్కడ ఉద్యోగాలేమీ లేవని.. చేయాలని ఆమె చెప్పడంతో యువతి షాకైంది. Also Read: తాను ఆపదలో ఉన్నానని గ్రహించి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని తనకు తెలిసిన ఓ మహిళ వద్ద ఆశ్రయం పొందింది. మరోవైపు యువతి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు అనంతపురం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలించిన అనంతపురం పోలీసులు ప్రొద్దుటూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు జరిగిన అనుభవాన్ని యువతి వివరించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 28, 2020 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-escaped-from-prostitution-gang-in-anantapur-district/articleshow/76055204.cms

No comments