Breaking News

ఆన్ లైన్‌లో డ్రెస్ వేలం వేస్తున్న తెలుగు హీరోయిన్


లాక్‌డౌన్‌ వల్ల కష్టాలు పడుతున్న పేద కుటుంబాల కోసం సినీతారలంతా తమకు తోచిన సాయం చేస్తున్నారు. పలువురు హీరో హీరోయిన్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. తాజాగా మరో హీరోయన్ ముందడుగు వేశారు. పేదల కోసం నిత్యా మీనన్‌ తన డ్రస్‌ను వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో నేను ధరించిన డ్రస్‌ను వేలం వేస్తున్నా. దీని ద్వారా వచ్చిన డబ్బులను అర్పణం ట్రస్ట్‌కి ఇస్తాను. ఈ ట్రస్ట్‌ గ్రామాల్లో పేద ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడానికి అవసరమైన సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నా కోసమే నా ఫ్రెండ్‌, డిజైనర్‌ కావేరి ఈ డ్రస్‌ డిజైన్‌ చేశారు’’ అని నిత్యా మీనన్‌ పేర్కొన్నారు. మే 16 ఆదివారం 4 గంటలకు వేలం ప్రారంభమవుతుందని తెలిపారు నిత్యా మీనన్. వేలం పాటకు సంబంధించిన వివరాల్ని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిత్యా పోస్టు చేశారు. @indiawasted అనే సైట్‌లో ఆక్షన్ జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు ఎవరైనా ఈ వేలంపాటలో పాల్గొని డ్రెస్‌ను సొంతం చేసుకోవచ్చన్నారు. అత్యధిక ధర చెల్లించిన వారికే తన డ్రెస్ దక్కుతుందన్నారు నిత్యా. అంతేకాకుండా లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో తాను ధరించిన డ్రెస్సుకు సంబంధించిన వీడియోను కూడా నిత్యా షేర్ చేశారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా వేలం పాట నిర్వహిస్తోంది. తాను స్వయంగా గీసిన పేయింటింగ్స్‌ను వేలం వేస్తున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో ప్రకటించింది. తద్వారా వచ్చిన డబ్బులను వలస కార్మికుల కోసం ఖర్చు చేస్తానంది. పేయింటింగ్స్ వేలం వేయడం వల్ల వచ్చిన డబ్బుతో వలసకార్మికులకు రేషన్ అందిస్తానని తెలిపింది ఈ భామ.


By May 16, 2020 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithya-menen-auction-for-own-dress-4pm-on-sunday-to-support-a-charity/articleshow/75770150.cms

No comments