Breaking News

నాగ్ అశ్విన్‌ కొత్త ఆలోచనలు అదుర్స్ అంతే!


‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాలు తెరకెక్కించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. లాక్ డౌన్‌ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను తెగ వాడేస్తూ.. తన మెదడులో తడుతున్న కొత్త కొత్త ఆలోచనలు సినీ ప్రియులు, అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటున్నాడు. ఇటీవలే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచడానికి బీరు, బ్రీజర్లు అమ్మడానికి అనుమతులు పొందితే ఎలా ఉంటుంది..? అనే ఆలోచనను పంచుకున్న ఆయన.. తాజాగా మరో కొత్త ఆలోచనతో ట్విట్టరెక్కారు.

అదేమిటంటే.. ‘డ్రైవ్‌ ఇన్స్‌’లో  సినిమా ఐడియా ఎలా ఉంటుంది..? అని నెటిజన్లను అడిగాడు. అంటే.. బయటే అందరూ కార్లు, బైక్లు పార్క్‌ చేసుకొని సినిమా చూడొచ్చని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే పాత కాలంలో టూరింగ్‌ టాకీస్‌ లాగా?. ఏ భాషా చిత్రాలైనా సరే.. ఇప్పటికే విడుదలైన సినిమాలు, క్లాసిక్స్‌, నచ్చిన సినిమాలను డ్రైవ్‌-ఇన్‌లో చూడాలనుకుంటున్నారా?’ అని అర్థమని ట్వీట్‌లో నాగీ రాసుకొచ్చాడు. వాస్తవానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య నాటికి నేటికీ చాలా తగ్గిపోతోంది. ఇది అక్షరాలా నిజమే. అందుకే రోజురోజుకూ ఓటీటీ (అమెజాన్, నెట్‌ ఫ్లిక్స్‌)కు సినీ ప్రియులు పరిమితం అవుతున్నారు. 

అందుకే.. ఇలాంటి తరుణంలో సినీ ప్రియులను థియేటర్స్‌కు రప్పించేందుకు.. సినీ థియేటర్స్ యాజమాన్యాలకు నాగీ చాలా చాలానే ఐడియాలు ఇస్తున్నాడు. నిజంగా నాగీ కొత్త కొత్త ఆలోచనలు అదుర్స్ అనేలా ఉన్నాయి. అయితే ఒకటి అర వివాదాస్పదం అవుతున్నాయ్.. ప్రతి విషయంలోనూ పాజిటివ్, నెగిటివ్‌ను చూసే జనాలుంటారు.. అందుకే రకరకాలుగా స్పందిస్తుంటారు. మరి నాగీ ఆలోచనలు ఏ మాత్రం ఆచరణలోకి వస్తాయో.. ఇంకా ఎన్నెన్ని ఆలోచనలు తన బుర్రలో నుంచి బయటపెడతాడో చూడాలి.



By May 18, 2020 at 03:48PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51061/nag-aswin.html

No comments