Breaking News

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో వస్తున్న పవన్ కళ్యాణ్


టాలీవుడ్ పవర్ స్టార్ అటు సినిమాలతో... ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానన్న పవన్ తాజాగా కొత్త సినిమాలు తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న కొత్త చిత్రాలపై అనేక రకాల అప్ డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా పవన్ క్రిష్ దర్శత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పవర్ స్టార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ కథని పూర్తి చేసి కాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు. ఈ చిత్రం గురించి టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. గతంలో జూ. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథకే కొన్ని మార్పులు చేసి పవన్ కోసం హరీష్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. అయితే ఆ కథనే పవన్ ఓకె చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ ఎన్టీఆర్ కోసం ఓ కథని వినిపించాడు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ అలాగే ఉండడంతో హరీష్ ఆ కథకు కొన్ని మార్పులు జోండించి పవన్ కు వినిపించినట్లు సమాచారం. పవన్ ఎలాంటి మార్పులు లేకుండా స్టోరీని ఓకె చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలని మరో హీరోతో తెరక్కించిన సందర్భాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కరోనా కనికరిస్తే వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


By May 17, 2020 at 01:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-hero-pawan-kalyan-says-ok-to-jr-ntr-rejected-script/articleshow/75785896.cms

No comments