మహేశ్ బాబు ఇలా మారడానికి కారణమేంటో!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు రోజుకు రోజుకూ వయసు పెరుగుతోందో.. తగ్గుతోందా అభిమానులకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు గౌతమ్‌కు.. మహేశ్ బాబు తండ్రా లేకుంటే సోదరుడా అన్నంతగా జనాలు ఆశ్చర్యపోతున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రిటీస్. ముఖ్యంగా మొదట ఫ్యామిలీ ఆ తర్వాతే సినిమా అని భావించే మహేశ్.. ఈ లాక్ డౌన్‌తో పూర్తి సమయం పిల్లలతోనే గడిపేస్తున్నాడు. సోషల్ మీడియలో రోజుకో ఫొటో, వీడియోలు పెట్టి అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా.. సూపర్ స్టార్ సతీమణి నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో, అభిమానుల్లో, సినీ ప్రియుల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మహేశేనండోయ్ బాబూ..
ఇదిగో పక్కనుండే ఫొటోను చూశారా.. అసలు ఈ పిక్‌లో ఉండేది మహేశా లేకుంటే గౌతమా అని కన్ఫూజ్ అవుతున్నారు కదూ.. మహేశేనండోయ్ బాబూ.. అలా యంగ్‌గా ఉన్నాడంతే. పోనీ అదెప్పుటి ఫొటోనో అనుకుంటున్నారేమో.. రీసెంట్ పిక్చరే. ఈ ఫొటో చూస్తుంటే మహేశ్‌ను ఉద్దేశించి వేటూరి రాసిన ‘నవ నవ నవతర యువతల రాజకుమారుడు’ అనే గేయం గుర్తొస్తోంది. ఆ చిత్రంలో కథాపరంగానే కాదు నిజ జీవితంలోనూ మహేశ్ ఇలా చిన్న పిల్లాడిలా మారిపోతున్నాడు. ఆ హెయిర్ స్టయిల్.. కళ్లద్ధాలు, ఆ బుగ్గలు చూసిన ఫ్యాన్స్ మిల్క్ బాయ్ అలానే ఉంటాడు మరీ అని అంటున్నారు. 44 ఏళ్ల వయస్సులోనూ 18 ఏళ్ల కుర్రాడిలా నాజుగ్గా ఉంటూ కిరాక్ పెట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటోను చూసిన అభిమానులు.. సినీ నటులు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇందుకేనా..!?
సీనియర్ నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ.. ‘బాగా మగ్గిన బంగినపల్లిలా రోజురోజుకీ మెరిసిపోతున్నాడు మా కృష్ణగారి అబ్బాయి’ అని కామెంట్ చేశాడు. మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ..‘మహేశ్ సార్ మీరు హాలీవుడ్ సూపర్ స్టార్‌లా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. కాగా.. లాక్ డౌన్ ఎత్తేయడమే ఆలస్యం ‘గీత గోవిందం’ సినిమాను తెరకెక్కించి ఫేమస్ అయిన పరశురామ్‌తో మహేశ్ సినిమా ఉంది. అందుకే సూపర్‌స్టార్ ఇలా తయారవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో లవ్ అండ్ మోస్ట్ ఎమోషనల్ టచ్ ఉంటుందట అందుకే లవర్ బాయ్‌లా తయారవుతున్నాడని టాక్ నడుస్తోంది.
By May 18, 2020 at 03:52PM
No comments