కామ కోరికలతో రగిలిపోయి.... ఇంటి యజమాని కుమార్తెపైనే అఘాయిత్యం
లాక్‌డౌన్‌లోనూ కామాంధుల దుశ్చర్యలకు అడ్డు లేకుండా పోతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రామ్‌సింగ్(పేరు మార్చాం) వ్యాపారం చేస్తూ ఓ ఇంట్లో మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య పిల్లలతో కలిసి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో ఒంటరిగా ఉంటున్న రామ్‌సింగ్ లైంగిక కోరికలతో రగిలిపోయేవాడు. ఈ క్రమంలోనే ఇంటి యజమాని కుమార్తెపై అతడి కన్ను పడింది. Also Read: నాలుగు రోజుల క్రితం యజమాని ఓ ఎమర్జెన్సీ పని నిమిత్తం భార్యతో కలిసి బయటకు వెళ్లడంతో వారి కుమార్తె ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న రామ్‌సింగ్ ఆమెను బెదిరించి అత్యాచారానికి యత్నించాడు. భయపడిపోయిన బాధితురాలు వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దీంతో ఛాన్స్ మిస్ అయిందన్న ఆక్రోశంతో రామ్‌సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By May 04, 2020 at 10:28AM
No comments