Breaking News

తొలినాళ్లలో కరోనా నమూనాలను ధ్వంసం చేశాం.. ఎట్టకేలకు అంగీకరించిన చైనా


విషయంలో చైనాపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. డ్రాగన్ చేసిన ప్రకటనతో ప్రపంచం నివ్వెరపోతోంది. వైరస్ వ్యాపించిన తొలినాళ్లలో సేకరించిన నమూనాలను నాశనం చేసినట్టు అమెరికా నిఘా వర్గాలు నివేదిక పేర్కొనగా.. దీనిని చైనా అంగీకరించడం గమనార్హం. వైరస్‌ వ్యాపించిన తొలినాళ్లలో సేకరించిన నమూనాలను నాశనం చేయాలని జనవరి 3న తామే ఆదేశించినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. అప్పటికి సార్స్‌- కోవ్‌-2ను గుర్తించకపోవడంతోనే ఆ ప్రయోగాత్మకంగా వినియోగానికి సేకరించన నమూనాల వల్ల వైరస్ మరింత మందికి వైరస్ వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకొన్నామని ఎన్‌హెచ్‌సీ సైన్స్‌ అండ్‌ హెల్త్‌ విభాగానికి చెందిన ల్యూ డెంగ్‌ఫెంగ్‌ ప్రకటించారు. కేవలం అనుమతుల్లేని ప్రయోగశాలల్లోని నమూనాలనే ధ్వంసం చేయాలని ఆదేశించామని, ఈ విషయాన్ని అమెరికా అధికారులు వక్రీకరించి రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. గుర్తుతెలియని న్యుమోనియా వ్యాపించగానే కారణాలను అన్వేషించడానికి జాతీయ స్థాయి రిసెర్చ్ ల్యాబొరేటరీలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తి సమాచారం వెల్లడయ్యేదాకా ఆ వైరస్‌ను అడ్డుకొనేందుకు ‘క్లాస్‌-2’ లేదా ‘అత్యంత వ్యాధికారకం’గా వర్గీకరించామని ల్యూ తెలిపారు. వైరస్‌ పరీక్షలకు అవసరమైన రక్షణ సదుపాయాలు లేని ల్యాబ్‌ల్లోని నమూనాలను ధ్వంసం చేయమన్నామని పేర్కొన్నారు. గతంలో ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌ నమూనాలను ప్రపంచ దేశాలకు చైనా అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను అనుసరించి పరిశోధనలకు సహకారం, వ్యాక్సిన్, టెస్టింగ్ కిట్లు వంటి వాటి తయారీ, పంపిణీకి చైనా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వైరస్ విషయంలో తమపై అమెరికా చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కరోనా వైరస్ ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతోంది అనే దాని గురించి సమాచారాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నించింది.. వాస్తవానికి ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా భాగస్వామిని చేసిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మూడు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే.


By May 16, 2020 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-acknowledges-destroying-early-coronavirus-samples-confirming-us-accusation/articleshow/75770707.cms

No comments