Breaking News

వరకట్న వేధింపులకు మహిళ బలి.. పోలీసుల అదుపులో భర్త


ఓ వివాహిత ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కట్నం కోసం అత్తింటి వారు పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా కనకపురం పట్టణంలో జరిగింది. మళవళ్లి తాలూకా బాళెహొన్నిగ గ్రామానికి చెందిన పూర్ణిమ(22)కు ఇదే గ్రామానికి చెందిన మునిమాదేవ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. మునిమాదేవ కనకపురలోని ఓ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. Also Read: గురువారం ఉదయం బెడ్రూమ్‌లో పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మునిమాదేవ పూర్ణిమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వెంటనే అక్కడికి చేరుకుని విగతజీవిగా పడివున్న కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ అల్లుడు పెళ్లయినప్పటి అదనపు కట్నం కోసం వేధించేవాడని, ఇటీవలే రూ.లక్ష ఇవ్వకపోతే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించాడని పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నాడు. లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మునిమాదేవ, అతడి అన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:


By May 15, 2020 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-karnataka-over-dowry-harassment/articleshow/75751561.cms

No comments