Breaking News

వావ్..! అల్లు అర్జున్ పాటకు చిందేసిన సిమ్రాన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్


అల్లు అర్జున్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి నాన్ బాహుబలి రికార్డులను చెరిపేస్తూ సంచలనం సృష్టించింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమన్ బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ''రాములో రాములా, బుట్ట బొమ్మా'' సాంగ్స్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్- పూజా హెగ్డే స్టెప్స్ ఫిదా చేశాయి. దీంతో ఈ పాటలకు తమదైన డాన్స్ చేస్తూ టిక్ టాక్ సెన్సేషన్‌ చేసేశారు ప్రేక్షకులు. ఎంతో మంది ఈ సాంగ్ క్లిపింగ్స్‌పై డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం 'బుట్టబొమ్మ' సాంగ్‌పై హుషారెత్తించే స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి సురేఖావాణి, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పాటపై చిందేయగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆ లిస్టులో చేరిపోయింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సిమ్రాన్ 'బుట్టబొమ్మ' పాటపై డాన్స్ చేసి మురిపించింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో వైరల్ అయింది. సిమ్రాన్ స్టెప్స్ చూసి వావ్! సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికీ 'అల.. వైకుంఠపురములో' ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుండటం చూసి ఆనందంలో మునిగితేలుతోంది చిత్ర యూనిట్.


By May 15, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-heroine-simran-tik-tok-video-on-buttabomma-song/articleshow/75751322.cms

No comments