Breaking News

పేడ ఎత్తిన ఉపాసన.. తండ్రితో కలిసి ఫామ్ హౌస్‌లో.. రియాక్ట్ అయిన నమ్రత


రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా అందరికీ ఆదర్శంగా నిలిచే పనులు చేస్తోంది కొణిదెల . సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన, తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను పంచుకునే ఆమె ఈ సారి పొలంలో పేడెత్తుతున్న పిక్స్ షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. గొప్పింటి కోడలు, పైగా ఐశ్వర్యవంతురాలు అయి ఉండి సాధారణ వ్యక్తిలా మారిపోయింది ఉపాసన. నిత్యం సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ, నెటిజన్లకు ఆరోగ్య చిట్కాలను అందించే ఈ మెగా కోడలు.. లాక్‌డౌన్ సమయాన్ని సమర్ధవంతంగా వాడుకుంటూ ఆదర్శప్రాయమైన పనులు చేస్తోంది. తాజాగా తన తండ్రితో కలిసి వ్యవసాయ క్షేత్రంలో ఉల్లాసంగా గడిపింది ఉపాసన. ఆవు, దూడలతో మమేకమవుతూ.. వాటి పేడ ఎత్తుతూ ఫొటోలు దిగింది. తనను తాను ఆధునిక తరం రైతుగా అభివర్ణించుకుంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు 'డాడీతో పేడ అమ్మాయి' అంటూ సరదాగా ట్వీట్ చేసిన ఉపాసన.. "ఆర్గానిక్ (సేంద్రియ) వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. ఎరువు తయారుచేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తర్ఫీదు అందుకుంటున్నాను. రమణీయమైన సుస్థిర జీవనాన్ని ఆకళింపు చేసుకుంటున్నాను" అని పేర్కొంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ''సూపర్ మేడం.. ఆధునిక మహిళలకు ఆదర్శప్రాయం మీరు'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సైతం స్పందిస్తూ ఉపాసనను పొగిడింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read:


By May 15, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-konidela-learning-organic-farming-at-her-farmhouse/articleshow/75751884.cms

No comments