Breaking News

వరంగల్‌లో డెడ్‌బాడీల కలకలం.. ఆరుగురి అరెస్ట్, వెలుగులోకి ఎన్నో కోణాలు


వరంగల్‌ నగర శివారు గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక వాడలోని బావిలో లభించిన 9 మృతదేహాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బావిలో నుంచి శుక్రవారం బయటకు తీసిన 9 మృతదేహాలకు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం పూర్తయింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా వారిని బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మునగడం వల్లే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. 9 మందిలో ఏడుగురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు బిహార్‌కు చెందిన వారు. వీరందరికీ ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Also Read: ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మంకుషా, సంజయ్ కుమార్ యాదవ్, యాకుబ్ పాషా, రామచందర్, సుమన్, మోహన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం సంజయ్‌కుమార్‌ యాదవ్, మంకుషాను సంఘటనా స్థలానికి తీసుకువెళ్లిన పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ తరహాలో పరిశీలించారు. ఇద్దరు బిహారీలు బస చేసిన గదిని అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. వీరిని బిల్డింగ్ మీది నుంచి బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. పోలీసులు సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. Also Read: తొమ్మిది మంది బావిలో పడేసే సమయానికి ప్రాణాలతోనే ఉన్నారని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల వారంతా చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ రజామాలిక్‌ పేర్కొన్నారు. అయితే నలుగురు మృతుల శరీరంపై గాయాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. వారిపై ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా?.. లేదా? అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే తెలుస్తుందన్నారు మరోవైపు ఈ కేసులో సెల్‌ఫోన్‌ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. బుష్రా ఖాతూన్, ఆమెతో అఫైర్ ఉందని అనుమానిస్తున్న యాకూబ్‌ ఫోన్‌ కాల్స్‌తో పాటు ఇతరులతో మక్సూద్‌ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మృతుల్లో ఏడుగురి సెల్‌‌ఫోన్లు కనిపించడం లేదని, వాటికోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By May 24, 2020 at 10:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/warangal-dead-bodies-police-arrests-6-suspected-people/articleshow/75935211.cms

No comments