Breaking News

వన్యప్రాణులను హింసిస్తూ టిక్‌టాక్ వీడియో.. యువకుడి అరెస్ట్


నిబంధనలకు విరుద్ధంగా వన్య ప్రాణులపై టిక్‌టాక్‌ వీడియోలు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్న ఓ యువకుడిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు గొర్రెలను మేపుతుంటానే. ఇందుకోసం సమీపంలోన అటవీ ప్రాంతానికి నిత్యం వెళ్తుంటాడు. ఆ అటవీ ప్రాంతంలో అనేక వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని పట్టుకుని హింసిస్తూ అతడు వీడియోలు తీసుకుంటున్నాడు. తర్వాత వాటిని టిక్‌టాక్‌ యాప్‌లో పోస్ట్ చేస్తున్నాడు. Also Read: ఇటీవల జింక పిల్లను పట్టుకుని మేకపాలు తాగించడం, కుందేలును చంపి దాని మాంసాన్ని కుక్కలకు ఆహారంగా వేయడం వంటి ఘటనలకు పాల్పడి వాటి వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు బుధవారం అరెస్ట్ చేసి అటవీశాఖ సెక్షన్‌ అధికారి రామచంద్రనాయక్‌కు అప్పగించారు. అతన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఆత్మకూరు పారెస్ట్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వన్యప్రాణులను హింసిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By May 22, 2020 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-in-anantapur-district-over-making-tiktok-videos-on-wild-animals/articleshow/75881390.cms

No comments