Breaking News

మద్యం మత్తులో ఘర్షణ.. స్నేహితుడి తలను గోడకేసి కొట్టి దారుణహత్య


మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన రాజధాని బెంగళూరులోని రామమూర్తినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంకకు చెందిన రాజు (40), రామమూర్తినగర 4వ క్రాస్‌ బోవి కాలనీకి చెందిన నేత అనే యువకుడు స్నేహితులు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో వైన్‌షాపులు తెరవడంతో మంగళవారం సాయంత్రం ఇద్దరూ మద్యం తెచ్చుకుని నేత ఇంట్లో తాగారు. Also Read: అయితే తెచ్చుకున్న మద్యంలో ఎక్కువ భాగం రాజు తాగేయడంతో నేత అతడితో గొడవపడ్డాడు. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నేత రాజు తలను గోడకేసి కొట్టి కుక్కర్‌తో బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రాజు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసలుు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి నేత గతంలో ఓ హత్యకేసులో జైలుకెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By May 08, 2020 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-friend-over-argument-in-alcohol-intoxicated/articleshow/75617413.cms

No comments