మరోసారి మానవత్వం చాటుకున్న ఎన్టీఆర్.. మీ అందరికీ నేనున్నా అనే భరోసా!
కరోనా వైరస్ (కోవిడ్ 19) నిర్మూలనలో భాగంగా ఓ వైపు ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే.. మరోవైపు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఎందరో నటీనటులు ఈ కల్లోల సమయంలో మానవత్వం చాటుకుంటున్నారు. తమకు తోచిన సాయం చేస్తూ ఉన్నంతలో కొందరిని ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినీ కార్మికుల కోసం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేదల కోసం ఆర్ధిక సాయం అందించిన .. మరోసారి తన సొంత స్టాఫ్ యోగక్షేమాలకై ముందుకొచ్చారని తెలుస్తోంది. ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్.. తన సొంత స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ఆర్ధిక సాయం చేస్తున్నారని తెలిసింది. వారి వారి కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకోకుండా అడ్వాన్స్ జీతాలు చెల్లిస్తున్నారట ఎన్టీఆర్. అంతేకాదు ఎవ్వరికెలాంటి ఆర్ధిక అవసరం వచ్చినా ఆదుకుంటానని ఆయన ప్రామిస్ చేశారట. తన స్టాఫ్ ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని, ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ అందరికీ నేనున్నా అనే భరోసా ఇస్తున్నారట ఎన్టీఆర్. ఈ విషయం తెలిసి అశేష టాలీవుడ్ లోకం ఎన్టీఆర్ మంచి మనసును అభినందిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ మరో హీరో. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ ముగియగానే RRRతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. Also Read:
By May 08, 2020 at 10:33AM
No comments