కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: దేశంలో మహమ్మారి విజృంభణ.. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో
⍟ కరోనా వైరస్‌కు సంబంధించిన దాదాపు 53 జన్యు క్రమాలను భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి సిద్ధం చేసింది. వీటిని ‘గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫూయెంజా డేటా’ అనే అంతర్జాతీయ జీనోమ్ డేటాబేస్‌కు సమర్పించింది. వైరస్ గురించి మరింత అర్థం చేసుకోవడానికి, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ⍟ దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,300 దాటింది. వీరిలో 16,776 మంది కోలుకోగా.. 1,889 మంది మృత్యువాతపడ్డారు. మరో 37,916 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ⍟ మహమ్మారిని కట్టడిచేయడానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ‘వందే భారత్ మిషన్’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా తొలి విడత రెండు విమానాలలో 363 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో గురువారం రాత్రి ల్యాండ్ అయింది. ⍟ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు సమయం గతవారం రోజులతో పోల్చితే గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల కిందట పాజిటివ్ కేసుల రెట్టింపునకు 12 రోజుల సమయం పడితే.. ప్రస్తుతం అది 10.2 కి తగ్గిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి వేగంగా పెరుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కేంద్రం పేర్కొంది. ⍟ మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతోంది. గురువారం ఏకంగా 1,323 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటింది. ఒక్క ముంబయి నగరంలోనే బాధితుల సంఖ్య 11,300 దాటింది. కాగా, ముంబయి సెంట్రల్ జైల్లో ఖైదీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడ్డారు. ఆర్ధర్ రోడ్ జైల్లోని 77 మంది ఖైదీలు, సిబ్బంది 26 మంది మొత్తం 103కి వైరస్ నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ⍟ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. పట్టాలపై నిద్రిస్తోన్న 14 మంది వలస కూలీల ప్రాణాలను వేగంగా దూసుకొచ్చిన రైలు బండి బలి తీసుకుంది. శుక్రవావారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ⍟ కేరళలో వరసగా రెండో రోజు కొత్త కేసులు నమోదు కాలేదు. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు రోజులు ‘0’ కేసులు నమోదవడం గమనార్హం. మంగళవారం మాత్రమే కొత్తగా 3 కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గురువారం (మే 7) కొత్త కేసులేవీ నమోదు కాలేదని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ⍟ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా గుర్తించిన కరోనా కేసులు 15 అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1122కు చేరాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 693 మంది డిశ్చార్జి అయ్యారు. ⍟ దేశంలో కరోనా కేసులు జూన్, జులై నెలల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మోడలింగ్ డేటా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ⍟యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన గూడ్స్ ఆటోను ఫొటో తీస్తూ అదే వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. బొర్రొళ్లగూడెం స్టేజీ వద్ద ఆగి ఉన్న ఓ వాహనాన్ని గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో గురువారం మరో 56 కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,833కు చేరుకుంది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ⍟విశాఖలో గ్యాస్ లీకేజ్‌తో నగరవాసులు వణికిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ గ్యాస్ లీకైనట్లు ప్రచారంతో స్థానికులు పరుగులు తీశారు. గోపాలపట్నం సమీప గ్రామాల ప్రజలు రోడ్లుపైకి వచ్చారు. తర్వాత పోలీసులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ⍟ ఏపీని కరోనా పరేషాన్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో.. జనాలు వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తగా ఎక్కువ కేసులు ఉన్నాయి.. అక్కడ ఏకంగా 540 కేసులు ఉన్నాయి. మరణాలు 12 ఉన్నాయి.
By May 08, 2020 at 10:12AM
No comments