Breaking News

ఫుడ్ డెలివరీ పేరిట గంజాయి సరఫరా... లాక్‌డౌన్‌లోనూ ఆగని అక్రమ దందా


లాక్‌డౌన్‌ కారణంగా ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అక్రమార్కులేమో తమ చీకటి వ్యాపారాలు యథేచ్ఛగా నిర్వహించుకుంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఫుడ్ డెలివరీకి అనుమతిస్తే ఓ యువకుడు దాన్ని సరఫరాకు అనుకూలంగా మార్చుకున్నాడు. చెన్నైకి చెందిన ఓ యువకుడు బీకామ్ చదివి కొన్నాళ్లు ఫుడ్ ఆన్‌లైన్ డెలివరీ సంస్థలో పనిచేసి మానేశాడు. Also Read: ఆ సంస్థ యూనిఫామ్ అతడి వద్దే ఉంది. లాక్‌డౌన్ కాలంలో అతడికి ఉపాధి లేకపోవడంతో గంజాయి సరఫరాకు తెరదీశాడు. ఫుడ్ డెలివరీ యూనిఫామ్ వేసుకుని గంజాయిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ దందాపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పటిష్టం చేసి ఆ యువకుడిని పట్టుకున్నారు. అతడి వద్ద 20 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. Also Read:


By May 04, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chennai-young-man-delivering-ganja-in-lock-down-period-arrested/articleshow/75527857.cms

No comments