తూ.గో.జిల్లాలో నకిలీ డీఎస్పీ అరెస్ట్.. ఎస్ఐ సాయంతో ప్రజలను దోచుకుంటూ
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా పోలీసులు విధుల్లో తీరిక లేకుండా గడుపుతుంటే మరోవైపు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కోవిడ్-19 ప్రత్యేక అధికారులంటూ ప్రజలను మోసం చేస్తూ అందినంత దండుకుంటున్నారు. ఇలాగే కొవిడ్-19 ప్రత్యేక పోలీసు అధికారిగా అవతారమెత్తిన ఓ వ్యక్తిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బత్తిన వెంకన్నబాబు అలియాస్ వెంకటేష్, వెంకట్ (40) కొవిడ్-19 ఇంటెలిజన్స్ ప్రత్యేక డీఎస్పీ హోదాలో పోలీస్‌స్టేషన్ పరిధిలో తిరుగుతూ అనేక అక్రమాలకు పాల్పడేవాడు. సీతానగరం పీఎస్‌లో గతంలో ఎస్ఐగా పనిచేసిన ఆనంద్‌కుమార్ అండదండలతో అతడు చెలరేగిపోయాడు. Also Read: డీఎస్పీ అధికారినంటూ అందరినీ నమ్మించి వివిధ దుకాణాల్లో విలువైన సామగ్రిని తీసుకునేవాడు. దీనిపై బాధితుల నుంచి అనేక ఫిర్యాదు వెల్లువెత్తడంతో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీ బాజ్‌పేయ్ ఆదేశాలతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బుధవారం అతడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీఎస్పీ పీఎస్‌ఎన్ రావు వివరాలు వెల్లడించారు. నిందితుడు వెంకన్నబాబు రాజమహేంద్రవరంలో నివసిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అద్దె కార్లు నడుపుతూనే.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుడి బుధవారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీతానగరం ఇన్‌ఛార్జి ఎస్ఐ పి.విజయకుమార్ తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఆనంద్‌కుమార్‌ను ఉన్నతాధికారులు ఇప్పటికే వీఆర్‌కు పంపించారు. Also Read:
By May 21, 2020 at 08:18AM
No comments