Breaking News

రాజమండ్రిలో రౌడీషీటర్ దారుణహత్య.. తలపై బండరాళ్లతో దారుణంగా కొట్టి


రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ హత్య తీవ్ర కలకలం రేపింది. రాజమహేంద్రవరంలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో గల క్వారీ మార్కెట్ సమీపంలోని టీవీ రోడ్డులో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని ఆర్యాపురానికి చెందిన రౌడీ షీటర్‌ అద్దేపల్లి సతీష్‌(42)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: సతీష్‌‌ను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాళ్లతో బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ సంతోష్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే సతీష్‌తో శత్రుత్వం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. Also Read:


By May 21, 2020 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rowdy-sheeter-murder-in-rajahmundry-east-godavari-district/articleshow/75858512.cms

No comments