శ్రీరెడ్డి మెడలో తాళి వెనుక అసలు కథ ఇదీ..
టాలీవుడ్ వివాదాస్పద నటి.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరొందిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆమె గురించి జనాలందరికీ బాగా తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు నాలుగు వివాదాలు.. ఆరు కొట్లాటలు అనే తీరుగా ఉన్న ఈ హాట్ భామ.. చెన్నైకి చెక్కేసినా ఊరు మారొచ్చేమో కానీ.. కాంట్రవర్సీ.. కాంట్రవర్సీనే అన్నట్లుగా మరింత డోస్ పెంచి మరీ ప్రవర్తిస్తోంది. అక్కడికెళ్లాక కొత్తగా టిక్ టాక్ అకౌంట్ చేసిన ఈ భామ హాట్ హాట్ సొగసులతో కుర్రాళ్లను కైపెక్కిస్తూ డైరెక్టుగానే అలా.. ఇలా అని తెగ కామెంట్స్ చేసేస్తోంది. ఇటీవలే మెడలో కొత్తగా పసుపు కొమ్మ కట్టుకుని కొత్త పెళ్లి కూతురిలా తయారై హడావుడి చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీరెడ్డి రెండో పెళ్లి చేసుకుందోచ్.. ఇకనైనా శ్రీరెడ్డి బుద్ధొస్తుందా..? ఈ రెండో భర్త అయినా ఆమెకు గట్టిగా గడ్డిపెడతాడా..? ఇలా చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు కామెంట్స్ చేసేశారు.
ఇంకొందరైతే.. ఇంకో అడుగు ముందుకేసి పర్సనల్‌గా కూడా టార్గెట్ చేశారు. ఇలా బ్యాడ్ కామెంట్స్ కూడా రావడంతో చేసేదేమీ లేక ఇదీ పరిస్థితి. మెడలో తాళి వెనుక అసలు కథ అంటూ మరో వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ‘నాకు పెళ్లి కాలేదురా బాబూ.. జస్ట్ వీడియో కోసం పెట్టానంతే. దేవుడా నాకు పెళ్లి కాలేదు.. ఇదంతా జస్ట్ ఫర్ యాక్టింగ్ పర్ పస్’ అని క్లారిటీ ఇచ్చుకుంది. వాస్తవానికి శ్రీరెడ్డికి చెన్నై వెళ్లిన తర్వాత ఓ యంగ్ డైరెక్టర్ ప్రేమలో పడిందని.. సీక్రెట్‌గానే ఈ మధ్యే పెళ్లి చేసుకుందని కూడా వార్తలు వినిపించాయి. ఇక శ్రీరెడ్డి సెటిలైపోయిందని.. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తోందని కూడా టాక్ నడించింది. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా హాట్ హాట్ అందాల భామ స్పందిస్తూ పై విధంగా సింపుల్‌గా ఒక ముక్కలో వివరణ ఇచ్చుకుంది.
By May 21, 2020 at 06:42PM
No comments