Breaking News

కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో ప్రయోగాలు వద్దు: ప్రపంచ ఆరోగ్య సంస్థ


కరోనాపై పోరాటంలో సమర్థవంతంగా పని చేస్తోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం క్లినికల్ ట్రయల్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాత్కాలిక నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఔషధాన్ని ఉపయోగిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధం తీసుకోవడం వల్ల కోవిడ్ పేషెంట్లు మరణించే ముప్పు ఎక్కువ అవుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఓ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గత వారం వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ట్రయల్స్‌పై తాత్కాలిక నిషేధం విధించడం గమనార్హం. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా రెండు నెలల క్రితం హెడ్రాక్సీక్లోరోక్విన్ సహా నాలుగు ఔషధాలు, డ్రగ్ కాంబినేషన్ల సేఫ్టీ, సామర్థ్యాన్ని పరీక్షించడానికి డబ్ల్యూహెచ్‌వో అనుమతించింది. ఇందులో భాగంగా 17 దేశాల్లో 3500 మందిపై ట్రయల్స్ చేపట్టారు. తాను హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉపయోగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తెలిపారు. ఇటీవలే తాను ఆ ఔషధం వాడకాన్ని మానేశానని ట్రంప్ చెప్పారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


By May 26, 2020 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-19-treatment-who-suspends-trial-of-hydroxychloroquine/articleshow/75993633.cms

No comments