యాక్షన్ ప్లాన్‌కి రంగంలోకి దూకినందుకు థాంక్స్ సార్, మీరు ఊ అంటే..: విజయ్ దేవరకొండ
ఇలాంటి సమయం ఎప్పుడొస్తుందా? ఎవరు ముందుకొచ్చి సై అంటారా..? అని టాలీవుడ్ హీరోలు వెయిట్ చేశారో ఏమో కాని.. రౌడీ హీరో ‘Kill Fake News’ వివాదం ఉద్యమంలా మారింది. ఇండస్ట్రీ నుంచి విజయ్‌కి మద్దతు పెరుగుతుంది. హీరోలు, హీరోయిన్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తల్ని ప్రచురించే వెబ్ సైట్స్‌పై ఉక్కుపాదం మోపడానికి ‘Kill Fake News’ పేరుతో గళమెత్తాడు విజయ్ దేవరకొండ. తమకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతో తనపై కక్షకట్టి తప్పుడు వార్తల్ని ప్రచారం చేశారని సదరు వెబ్ సైట్ రాసిన ఆర్టికల్‌పై వీడియో రూపంలో సుదీర్ఘ వివరణ ఇచ్చి.. కడిగిపారేశారు విజయ్. ఇతనికి మద్దతుగా మహేష్, చిరంజీవి, రానా, రవితేజ, నాగార్జున, కొరటాల, వంశీ పైడిపల్లి, పూరీ, చార్మి, అడవిశేష్, రాధిక శరత్ కుమార్, అల్లరి నరేష్, శివ నిర్వాణ, రాశి ఖన్నా, క్రిష్, హరీష్ శంకర్, ప్రొడ్యుసర్ కౌన్సిల్ ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా ముందుకు వచ్చాయి. అయితే నాగార్జున ఒక అడుగు ముందుకు వేసి.. విజయ్‌కి మద్దతు ప్రకటిస్తే సరిపోదని ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌పై విజయ్ స్పందిస్తూ.. యాక్షన్ ప్లాన్ అనే మాట వింటుంటేనే ఉత్సాహం కలుగుతోందని, మీరు కూడా రంగంలోకి దూకి సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా వినిపిస్తున్నందుకు థాంక్యూ నాగ్ సర్ అని రిప్లై ఇచ్చారు. ‘సీనియర్లు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్మూలించగలం’ అని విజయ్ ట్వీట్ చేశారు. యాక్షన్ ప్లాన్ అనే సౌండ్ వింటే.. ఉత్సాహంగా ఉంది సార్.. ఈ సమస్య తీవ్రతను గట్టిగా వినిపించేందుకు రంగంలోకి దూకిన మీకు ధన్యవాదాలు సార్.. మీలాంటి సీనియర్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మేం మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాక్షన్ ప్లాన్‌పై చర్చించి.. ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించలం. అందుకు మేం అంతా సిద్ధంగా ఉన్నాం’ అంటూ ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ. Read Also:
By May 06, 2020 at 07:54AM
No comments