Breaking News

మద్యానికి డబ్బులివ్వలేదని... భార్యను తుపాకీతో కాల్చి చంపేశాడు


మద్యం కొనుక్కునేందుకు డబ్బులివ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాటోలి గ్రామానికి చెందిన దీపక్‌కు కొన్నాళ్ల క్రితం నేహ(25) అనే మహిళతో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. ఉపాధి కోసం దీపక్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా అతడు ఢిల్లీలో ఉంటున్నాడు. మార్చి నెలలో ఓ కార్యక్రమం కోసమని సొంతూరికి వచ్చిన దీపక్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. Also Read: దీపక్‌కు మద్యం అలవాటు ఉంది. ఇన్నాళ్లూ మూసివున్న వైన్‌షాపులు రెండ్రోజుల క్రితం తెరవడంతో అతడికి ప్రాణం లేచివచ్చింది. ఎలాగైనా మద్యం తాగాలనుకుని భార్యను డబ్బులు అడిగాడు. అయితే ఇంట్లో సరుకులు కొనడానికే డబ్బులు లేవని, మద్యానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయని నేహ భర్తను నిలదీసింది. దీంతో ఆవేశానికి గురైన దీపక్ తన దగ్గరున్న నాటు తుపాకీతో భార్యను విచక్షణా రహితంగా కాల్చి చంపేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కుమారుడు భయంతో పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయాడు. Also Read: తుపాకీ శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని నేహను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీపక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. గర్భంతో ఉన్న భార్యను విచక్షణా రహితంగా కాల్చిచంపిన దీపక్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. Also Read:


By May 06, 2020 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-man-shoots-pregnant-wife-over-she-refused-money-for-liquor/articleshow/75566791.cms

No comments