Breaking News

కరోనా తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులుంటాయ్!


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని కూడా దాదాపు అన్నింటినీ అతలాకుతలం చేసేసింది. టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకూ ఇంతవరకూ సినిమా షూటింగ్స్ కానీ.. రిలీజ్‌లు కానీ అస్సలే లేవ్. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ నటీనటులు, దర్శకనిర్మాతలు ఎప్పుడెప్పుడు మంచి రోజులొస్తాయా..? సినిమా షూటింగ్, రిలీజ్‌లు చేసుకుందామా..? అని వేయికళ్లతోవేచి చూస్తున్నారు. 4.0 లాక్‌డౌన్‌లో అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలు దాదాపు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ సినీ ఇండస్ట్రీకి మాత్రం ఎలాంటి శుభవార్త చెప్పలేదు.. కనీస సడలింపులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

మరోవైపు.. కరోనా తర్వాత పరిస్థితేంటి..? ఎలా ముందుకెళ్లాలి..? సినిమా షూటింగ్స్ ఎలా జరుపుకోవాలి..? ఎలా రిలీజ్ చేసుకోవాలి..? జనాలను థియేటర్స్‌కు ఏ విధంగా రప్పించాలి..? అని దర్శకనిర్మాతలు, థియేటర్ల యాజమాన్యం ప్లాన్స్ వేస్తున్నాయి. మరోవైపు నటీనటులు సైతం కమిట్మెంట్స్ ఇచ్చిన సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా..? అని వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చనే ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ.. కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. 

కరోనా తర్వాత.. సినిమా మార్కెటింగ్ ఎలా ఉండబోతోంది. ప్రత్యేకించి టాలీవుడ్ ఎలా మారుతుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఇకపై ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియా ఫంక్షన్స్, థియేటర్స్, మాల్స్‌కు వెళ్లడం, రోడ్ ట్రిప్పులు ఇలాంటివేమీ ఉండవ్. రానున్న రోజుల్లో అంతా డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ సంభాషణలే ఎక్కువగా ఉంటాయ్’ అని ఒ నిర్మాతగా శోభు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వాస్తవానికి పరిస్థితులు కూడా యార్లగడ్డ చెప్పినట్లుగానే ఉంటాయ్. ఎందుకు ఏమిటీ..? అని ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.



By May 20, 2020 at 06:45PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51091/after-corona.html

No comments