ఎన్టీఆర్‌ను మియా మాల్కోవాతో పోల్చిన వర్మ!
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకే కేరాఫ్‌గా పిలిపించుకునే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యమా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్స్‌ను పక్కనెడితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మాత్రం కాస్త మారిన మనిషిగా కనిపిస్తూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు. మే-20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ అభిమానులు పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోలను.. హ్యాష్ ట్యాగ్స్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఆర్జీవీ చాలా వ్యంగ్యంగా.. హాట్ హాట్‌గా రగిలిపోతూ కామెంట్స్ చేశాడు.
పోర్న్ స్టార్ తర్వాత ఎన్టీఆరే!
జూనియర్ సిక్స్ ప్యాక్ ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ వరుస ట్వీట్ల వర్షం కురిపించాడు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌లో నటించిన మియా మాల్కోవాను ఆర్జీవీ ఇంకా బొత్తిగా మరిచిపోలేదు. అందుకే అస్తమాను ఆమె గుర్తొస్తోందేమో గానీ.. ‘మియా మాల్కోవా తర్వాత నేను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్టీఆర్‌దే’ అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో ‘నేను గే (స్వలింగ సంపర్కుడు) కాదని మీకు బాగా తెలుసు. కానీ ఈ పిక్ చూశాక నేను ఒకటి కావాలని అనుకుంటున్నాను. ఆ బాడీ ఏంట్రా నాయనా..’ అని మరో ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం తెగ తిట్టిపోసేస్తున్నారు. మియా మత్తు ఇంకా దిగలేదా ఆర్జీవీ.. నీకెప్పుడు ఆ కామ పిచ్చి తగ్గుతుందో ఏంటోలే.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
By May 20, 2020 at 06:51PM
No comments