ఇంతకంటే కరోనా డేంజర్ అంటారా..?: మనోజ్
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 నడుస్తోంది. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్స్ లేవ్.. రిలీజ్‌లు లేవ్.. ఫంక్షన్స్ లేవ్.. ఆఖరికి పుట్టిన రోజు వేడుకలూ లేవ్. ఇక అసలు విషయానికొస్తే.. మే-20న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు యంగ్ హీరో మంచు మనోజ్‌ది కూడా పుట్టిన రోజే. కరోనా కష్టకాలం కావడంతో ఇరువురూ వేడుకలు జరుపుకోవట్లేదు. అయితే ఈ సందర్భంగా అభిమానులకు సుధీర్ఘంగా కొన్ని వివరణలు చేస్తూ లేఖ రాసి ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
ఈ కరోనా ఎంత భయ్యా..?
‘నాకు ఊహ తెలిసియక ముందు నుంచే నా పుట్టిన రోజునూ కొద్దో గొప్పో గ్రాండ్‌గానే చేసేవారంట. నాకు ఊహ తెలిశాక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరం కలిసి బాగానే చేసుకునే వాళ్లం. కానీ ఈ సంవత్సరం మాత్రం అడుగు దూరంలో ఆత్మీయులున్న.. అన్నదమ్ములున్నా.. అమ్మా, నాన్న ఉన్నా వెళ్లి ఆశీర్వాదం కూడా తీసులేని పరిస్థితి. ఇప్పుడందరూ కరోనాతో కలిసి జీవించక తప్పదని అంటున్నారు. ఈ విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదు. కరోనాను మించిన వాటితోనే కలిసి జీవించాం. గోకుల్ చాట్ వద్ద బాంబు పెట్టినవాడు కూడా మనందరితో కలిసి తిరిగినవాడే.. అంతటి క్రూరుడితోనే కలిసి తిరిగాం. ఈ కరోనా ఎంత భయ్యా..?’ అని ఇలాంటి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఇంతకంటే ప్రమాదకరమా!?
‘పెళ్లి బట్టలు కొనాలని వెళ్లి కారు పార్క్ చేస్తే పైనున్న ఫ్లైఓవర్ కుప్పకూలి మీదపడి చనిపోయారు. నీచమైన కాంట్రాక్టర్లు వేసిన బ్రిడ్జిలపైన సంతోషంగా తిరిగేస్తున్నాం. ఇంతకంటే కరోనా ఏమైనా ప్రమాదకరమా..?. కోఠి ఉమెన్స్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఎంతోమంది కామ పిశాచుల కళ్లను దాటుకుంటూ వెళుతుంటారు. అలాంటి వాళ్లకు ఈ కరోనాను దాటి వెళ్లడం ఓ లెక్కా..?. జాగ్రత్తగా ఈ కరోనాను కూడా కొద్ది రోజుల్లో దాటేస్తాం. అందరం బాగుంటాం.. అంతా బాగుంటుంది. గవర్నరమెంట్ మనకోసమే పనిచేస్తోంది. దాన్ని మోసం చేసి కాలర్ ఎగరేసుకుని బయటికి తిరిగే ప్రతి ఒక్కరికీ శీఘ్రమేమ కరోనా పాజిటివ్ ప్రాప్తిరస్తూ.. జైహింద్’ అని మనోజ్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. ఈ లెటర్‌ను నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు.
By May 20, 2020 at 06:41PM
No comments