Breaking News

దేశంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. నిన్న స్వల్ప ఊరట


దేశంలో కరోనా రక్కసి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,502 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే, గడచిన 6 రోజులతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. దీంతో, దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటింది. కొత్త కేసుల సంఖ్య తక్కువగా నమోదయినా... మరణాలు మాత్రం 172గా నమోదయ్యాయి. మహారాష్ట్రలో మంగళవారం కొత్తగా 2,091 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 54,758కి చేరింది. ఆ రాష్ట్రంలో వరుసగా పదో రోజు 2వేల మార్క్ దాటడం విశేషం. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 172 మంది ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 97 మంది చనిపోయారు. మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఇక, అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదయిన దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ కరోనాతో 4,344 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 82 శాతం.. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలోనే ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 17కు చేరింది. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 150,758కి చేరగా.. వీరిలో 64,277 మంది కోలుకున్నారు. మరో 82,161 మంది ఇంకా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ముంబయి నగరంలోనే 1,065 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవీలో కొత్తగా 59 మందికి వైరస్ సోకగా.. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. ఇప్పటి వరకూ 65 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మహారాష్ట్రలో 2,091, తమిళనాడు 646, గుజరాత్ 361, ఢిల్లీ 350, రాజస్థాన్ మధ్యప్రదేశ్ 254, ఉత్తరప్రదేశ్ 277, బీహార్ 231 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ 97, అసోంలో 95, జమ్మూ కశ్మీర్ 91, తెలంగాణ 71, కేరళలో 67, ఉత్తరాఖండ్ 44, హిమాచల్‌ప్రదేశ్ 24 మందికి కొత్తగా వైరస్ సోకింది. కరోనా కేసులు, మరణాల్లో ముంబయి నగరంలో అహ్మదాబాద్ పోటీపడుతోంది. ఇప్పటి వరకు ముంబయిలో 1,065 మంది ప్రాణాలు కోల్పోగా.. అహ్మదాబాద్‌లో 757 మంది చనిపోయారు. ముంబయి మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముంబయిలో మరణాల రేటు 3.64 శాతంగా ఉంటే.. అక్కడ 6.95గా ఉంది. అహ్మదాబాద్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 10,841కి చేరింది. ఏపీలో మంగళవారం మరో 97 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో పలు జిల్లాలకు చెందిన 48, వివిధ దేశాల నుంచి వచ్చిన 49 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 2,983కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 111, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 153 మంది ఉన్నారు. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 71 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే 38 కేసులు కాగా, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్‌లో 6, సూర్యాపేట, వికారాబాద్‌, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికుల్లో 12, ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో 4 కేసులను గుర్తించారు.


By May 27, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-positive-cases-in-india-cross-1-5-lakh-mark-over-4344-dead/articleshow/76022886.cms

No comments