Breaking News

భార్య గొంతు కోసి చంపేసిన భర్త.. చిత్తూరులో దారుణం


జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఐరాల మండలంలోని నాగంవాండ్లపల్లె పంచాయతీ వీఎస్‌ అగ్రహారంలో సోమవారం రాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. ఎస్ఐ శ్రీకాంత్‌ రెడ్డి కథనం మేరకు.. ఐరాల పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన జగదీశ్వర్‌రెడ్డికి తమిళనాడులోని ఉల్లిపుదూరు గ్రామానికి చెందిన సుస్మిత(30)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుత ఈ దంపతులు వీఎస్‌ అగ్రహారంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలో సోమవారం రాత్రి దంపతులు మరోసారి గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో ఆవేశానికి గురైన జగదీశ్వర్‌రెడ్డి వంట గదిలోని కత్తితో భార్య సుస్మిత గొంతు కోసి పరారయ్యాడు. సుస్మిత కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొనే లోపే ఆమె మృతి చెందింది. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో వారి ఇద్దరు పిల్లలు తల్లిలేని వారయ్యారు. Also Read:


By May 26, 2020 at 07:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-over-family-disputes-in-chittoor-district/articleshow/75989418.cms

No comments