Breaking News

షార్జాలో తెలంగాణ వ్యక్తి దారుణహత్య.. 6 నెలల క్రితమే ఉపాధి కోసం


తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి షార్జాలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల రవీంద్ర రోడ్డుకు చెందిన దేశవేని నర్సయ్య, రాధ దంపతుల రెండో కుమారుడు నవీన్‌(28) ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని నగరానికి వెళ్లాడు. అక్కడ షార్జాలోని ఓ కంపెనీలో కారు వాషింగ్‌ చేసేపనిలో కుదిరాడు. Also Read: ఈ నెల 23న రాత్రి తన గదిలో నవీన్‌ భోజనం చేస్తుండగా.. కేరళకు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కత్తితో నవీన్‌ను పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సమాచారాన్ని దుబాయిలోని భారత అధికారులు కోరుట్లలోని కుటుంబసభ్యలకు ఆదివారం రాత్రి సమాచారం అందించారు. దీంతో నవీన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. Also Read:


By May 26, 2020 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-man-murdered-by-kerala-man-in-sharjah-uae/articleshow/75989799.cms

No comments