అక్రమ సంపాదన కోసం మద్యం అమ్మకాలు.. గుంటూరులో డాక్టర్ అరెస్ట్
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం అందించాల్సిన డాక్టర్ దారి తప్పాడు. అక్రమ సంపాదన కోసం మొదలుపెట్టాడు. రాజేంద్రనగర్‌లో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో గుంటూరు ఈఎస్‌లు బాలకృష్ణన్, చంద్రశేఖర్‌రెడ్డి, స్టేట్ టాస్క్‌ఫోర్సు సీఐ వీరేంద్ర, గుంటూరు-2 సీఐ రేఖ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తుండగా రాజేంద్రనగర్‌కు చెందిన లావు వంశీకృష్ణ కారు డిక్కీలో కర్ణాటకకు చెందిన 16 మద్యం సీసాలు గుర్తించారు. Also Read: అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి సోదా చేయగా, విదేశీ స్కాచ్ విస్కీతో పాటు మరో 37 దేశీయ మద్యం సీసాలు లభించాయి. విచారణలో వంశీకృష్ణ రష్యాలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పని చేశాడని తెలియడంతో అధికారులు షాకయ్యారు. మద్యం సీసాలు కారులో పెట్టుకుని విక్రయిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలడంతో అతన్ని అరెస్టు చేసి 53 మద్యం సీసాలు, రూ.20 లక్షల విలువ చేసే కారు సీజ్ చేశారు. తన స్నేహితుడైన రహీంబేగ్ ఆ మద్యం సీసాలు సరఫరా చేస్తున్నాడని నిందితుడు చెప్పడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:
By May 26, 2020 at 07:23AM
No comments