Breaking News

చైనాకు స్క్రూ బిగిస్తోన్న ట్రంప్.. భారత్‌లో ఆందోళన!


కారణంగా అమెరికా, చైనాల మధ్య రాజుకున్న నిప్పు కారిచిచ్చులా వ్యాపించే సూచనలు కనబడుతున్నాయి. వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తీరుపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా.. క్రమంగా డ్రాగన్‌పై ప్రతీకార చర్యలను ప్రారంభించింది. చైనా సంస్థలను అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్‌ల నుంచి తప్పించడం, చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల నుంచి తొలగించడం లాంటి చర్యలతో డ్రాగన్‌పై క్రమంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. చైనాపై అమెరికా ప్రతీకార చర్యలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు దూకుడు పెంచారు. అటు డెమోక్రాట్లు సైతం చైనాను టార్గెట్ చేసుకుంటూ ట్రంప్ తీరును ఎండగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. యుఎస్ సెనేట్ బుధవారం ఆమోదించిన చట్టంతో అలీబాబా, బైదు వంటి చైనా కంపెనీలను యుఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీల జాబితా నుంచి తొలగించే వీలు కల్పిస్తోంది. ఎన్‌వైఎస్ఈ, నాస్డాక్ ఎక్స్ఛేంజీలలో లావాదేవీలు నిర్వహించే సంస్థలు యూఎస్ అకౌంటింగ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని తాజా చట్టం సూచించింది. దీంతో చైనా కంపెనీలు వరుసగా మూడు సంవత్సరాలు పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ పర్యవేక్షణ బోర్డు ఆడిట్ చేయవలసి ఉంటుందని సెనేట్ సభ్యులు స్పష్టం చేశారు. గూఢచర్యం, దొంగతనం వంటి నేరా ఆరోపణలతో చైనా విద్యార్థులు, ప్రొఫెసర్లను యూఎస్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం)లో చేరకుండా ఆపడానికి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని రిపబ్లికన్ల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ, విదేశీ విద్యార్థులను అమెరికా పంపడం ప్రారంభిస్తే, అక్కడ 400,000 మంది చైనా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి వీలు కలుగుతుందని చైనా అంటోంది. అమెరికా, చైనా మధ్య దౌత్య సంబంధాలు సంక్లిష్టంగా మారుతుండటంపై ముఖ్యంగా వాణిజ్యం, ప్రజల కదలికల విషయంలో తమకు నష్టం వాటిళ్లుతోందని భారత్ ఆందోళన చెందుతోంది. దీనిపై అమెరికా అధికారి బుధవారం మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సృష్టించిన ఆందోళన, అనిశ్చితి కొనసాగుతున్నా భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఇప్పటికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. దక్షిణ ఆసియా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆలిస్ వెల్స్ మాట్లాడుతూ.. గతేడాదికి అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులేనని, ఇక్కడ ఉన్న 200,000 మంది భారతీయ విద్యార్థుల ఉన్నత స్థానాల్లో చేరాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని, వీరు దేశాల మధ్య రాయబారులుగా వ్యవహరిస్తున్నారని ఓ ఫేర్‌వేల్ ఫంక్షన్‌లో అన్నారు. కానీ, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులను పెయిడ్ ఇంటర్న్‌లుగా ఏడాది నుంచి మూడేళ్లు పని చేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ కార్యక్రమానికి స్వస్తి పలకాలని ఒత్తిడి వస్తోంది. ఇది కొన్నిసార్లు పూర్తి ఉపాధికి దారితీస్తుందని, ఈ కార్యక్రమం ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక విధానమని, భారీగా ఉద్యోగ నష్టం ఉన్న సమయంలో అమెరికా దానిని భరించలేదని వాదిస్తున్నారు. దీనిపై ట్రంప్ త్వరలో అధికార ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ట్రంప్ యంత్రాంగం గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు కంటిగింపు కలిగించేలా తైవాన్‌కు 180 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల సరఫరాకు అంగీకరించింది. ఇక, కొత్త భద్రతా చట్టాన్ని ప్రతిపాదించి చైనా దీని ద్వారా హాంకాంగ్‌పై తన పట్టును నిలుపుకోడానికి ప్రయత్నించినా.. స్థానిక చట్టసభలో వ్యతిరేకత ఎదురయ్యింది.


By May 22, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trump-tightens-screws-on-china-cause-for-india-to-worry/articleshow/75882871.cms

No comments