ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం.. రూ.15 లక్షలివ్వాలంటూ మహిళకు బ్లాక్‌మెయిల్
తాను ఎమ్మెల్సీ కొడుకునంటూ ఓ వివాహితతో పరిచయం పెంచుకున్న యువకుడు కొద్దిరోజుల తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆమెతో సన్నిహితంగా దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని అడిగినంత డబ్బులు ఇవ్వాలంటూ చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన వివాహిత(30)కు కొద్దిరోజుల క్రితం భరత్‌కుమార్ అలియాస్ చింటు అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను ఎమ్మెల్సీ కుమారుడినంటూ ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తరుచూ ఆమె ఇంటికి వెళ్లి ముచ్చట్లు చెప్పేవాడు. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఫోటోలు తీసుకున్నారు. Also Read: కొద్దిరోజుల తర్వాత తనలోని మరో కోణాన్ని బయటకు తీసిన చింటు ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. తనకు రూ.15లక్షలు ఇవ్వకపోతే ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:
By May 22, 2020 at 09:48AM
No comments