Breaking News

చిరంజీవిని కలిస్తే ఆ మాట అన్నారు.. ఆ సమయంలో నేను!! జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్


ఇప్పుడిప్పుడిప్పుడే ఎదుగుతున్న నటీనటులు లాంటి టాప్ హీరోలని కలిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? చెప్పండి. అలాంటి ఆనందాన్నే పొందాడట జబర్దస్త్ కమెడియన్ . అంతేకాదు చిరంజీవి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నానని, ఆ క్షణాలు జీవితంలో మరచిపోలేనని అన్నాడు ఈ కమెడియన్. తాజాగా జరిగిన ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఈ సంగతులు తెలుపుతూ ఉబ్బితబ్బిబైపోయాడు అదిరే అభి. జబర్దస్త్ వేదికపై అలరించిన కమెడియన్స్ తమ కెరీర్‌లో చాలా ముందుకెళ్తున్నారు. పొట్ట చెక్కలయ్యే కామెడీ పండించి మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. దీంతో వాళ్లకు సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. సైడ్ క్యారెక్టర్స్, కమెడియన్ రోల్స్‌తో పాటు కథను బట్టి హీరోగా కూడా అవకాశమిస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటికే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి జబర్దస్త్ కమెడియన్స్ వెండితెరపై రాణిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడిన అదిరే అభి తన కొత్త సినిమా సంగతులు చెప్పాడు. తాను 'పాయింట్ బ్లాంక్' అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించానని, శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేశామని అన్నారు. ఓ పెద్ద సెలబ్రిటీతో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయించాలని ప్లాన్ రెడీ చేశాక అనుకోకుండా కరోనా కాటేసిందని అన్నాడు అదిరే అభి. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే అతిత్వరలో ఈ మూవీతో మీ ముందుకొస్తానని చెప్పాడు. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి గారిని కలిసి తాను హీరోగా చేస్తున్నానని, పోలీస్ ఆఫీసర్ రోల్ అని చెప్పగానే ఆయన పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారని చెప్పాడు అభి. పోలీస్ పాత్రకి తగినట్టుగా నీలో ఫిట్‌నెస్ కనిపిస్తోందని ఆయన చెప్పడంతో.. ఆ సమయంలో తన ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చాడు అదిరే అభి. Also Read:


By May 01, 2020 at 11:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/adire-abhi-says-about-his-meeting-with-chiranjeevi/articleshow/75485233.cms

No comments