కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వలస కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్
⍟ కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ⍟ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌తో 1,147 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటగా.. అక్కడ 459 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోనే 7వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ⍟ దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా వైరస్ మరణాల్లో సగానికి కంటే ఎక్కువ మంది 60 ఏళ్లు దాటినవారే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 60 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్నవారే ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం.. కరోనా మరణాల్లో మొత్తం 42 శాతం మంది వీళ్లే ఉన్నారు. 45 నుంచి 60 ఏళ్లవారికి ముప్పు తక్కువగా ఉంది. కరోనా మరణాల్లో వీరు 34 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ⍟ లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లొచ్చని ప్రకటించిన కేంద్రం.. వారి తరలింపు బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను బట్టి లక్షలాది మందిని ప్రత్యేక బస్సుల ద్వారా తరలించడం కష్టం కాబట్టి.. వారి కోసం ప్రత్యేక రైళ్లను నడపడానికి సంసిద్ధమైంది. ⍟ తెలంగాణలోని ఆరు జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన కేంద్రం.. 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, 9 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది. ⍟ ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లను ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్‌లో జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు లు ఉన్నాయి.. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖలు ఉన్నాయి. గ్రీన్‌జోన్‌గా విజయనగరం జిల్లా మాత్రమే ఉంది. ⍟ కరోనా మహమ్మారి ప్రధాన మంత్రిని సైతం వదల్లేదు. తనకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లుగా ఆ దేశ ప్రధాని మైఖైల్ మిషుస్తిన్ గురువారం వెల్లడించారు. ఈ మేరకు తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వీడియో కాల్‌లో చెప్పినట్లుగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ⍟ దేశంలో వేళ రోడ్డు ప్రమాదాలే కాదు, హాస్పిటల్స్‌కు వచ్చే అత్యవసర కేసుల సంఖ్య, మరణాలు కూడా గణనీయంగా తగ్గిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుండెపోట్లు, హృద్రోగం సహ ఇతర ఎమర్జెన్సీ కేసుల తగ్గిపోవడం కేవలం భారత్‌లోనే కాదని, మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ⍟ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నాటి నుంచి నుంచి కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్, లాంటి పదాల వాడకం పెరిగింది. వీటి గురించి కొందరికి అవగాహన ఉన్నప్పటికీ.. మరి కొందరికి మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. కాగా వీటి విషయంలో ఏపీ సర్కారు క్లారిటీ ఇచ్చింది. ⍟ మే 3వ తేదీతో దేశవ్యాప్తంగా విధించిన గడువు ముగియనుంది. ఇప్పటికే లాక్‌డౌన్ విధించి 40 రోజులు కావొస్తున్న నేపథ్యంలో మే 4 నుంచి గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తామనే సంకేతాలను కేంద్రం ఇప్పటికే పంపింది. వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడానికి మోదీ సర్కారు అనుమతి ఇచ్చింది. ⍟ పంది పిల్లలను క్వారంటైన్లో ఉంచడం ఏంటి అనుకుంటున్నారా? బ్రిటన్ నుంచి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ దిగుమతి చేసుకున్న పంది పిల్లలను క్వారంటైన్లో ఉంచారు. ఈశాన్య రాష్ట్రాల కోసం వీటిని తెప్పించగా.. కారణంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో పందులు చనిపోతున్నాయి. ⍟ ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 71 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గురువారం బులిటెన్‌లో ఆరోగ్య ఆంధ్ర ప్రకటించింది.
By May 01, 2020 at 11:07AM
No comments